Okinawa People : ఆ దీవి వాసులు 100 ఏళ్ల‌కు పైగా బ‌తుకుతారు.. వారి ఆహార ర‌హ‌స్యం ఏంటో తెలుసా.. మ‌నం కూడా తీసుకోవ‌చ్చు..!

Okinawa People : ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న సంస్కృతుల‌కు చెందిన ప్ర‌జలు జీవిస్తున్నారు. వారి ఆచార వ్య‌వ‌హారాలే కాదు.. ఆహార‌పు అల‌వాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఏ దేశానికి చెందిన ప్ర‌జ‌లు అయినా స‌రే.. వారు తీసుకునే ఆహారంపైనే వారి ఆయుర్దాయం ఆధార ప‌డి ఉంటుంది. ఇక జపాన్‌లోని ఆ దీవి వాసులు మాత్రం మ‌న‌కు అంద‌రికీ ల‌భ్య‌మ‌య్యే ఒక ప‌దార్థాన్నే రోజూ తింటారు. కానీ వారు స‌గ‌టున 100 ఏళ్ల‌కు పైగానే జీవిస్తారు. ఇంత‌కీ ఆ దీవి ఏది.. అది ఎక్క‌డ ఉంది.. వారు తీసుకునే ఆహారం ఏమిటి ? ఎందుకు వారు 100 ఏళ్ల‌కు పైగా జీవిస్తున్నారు ? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జ‌పాన్ లోని ఒకినావా అనే దీవికి చెందిన ప్ర‌జ‌ల స‌గ‌టు ఆయుర్దాయం.. దాదాపుగా 100 ఏళ్ల‌కు పైగానే ఉంటుంది. సైంటిస్టులు అక్క‌డి ప్ర‌జ‌ల‌పై చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఒకినావా దీవి పురుషులు క‌నీసం 80 ఏళ్ల‌కు పైగానే జీవిస్తార‌ట‌. అలాగే స్త్రీలు 86 ఏళ్ల‌కు పైగా బ‌తుకుతార‌ట‌. ఇక చాలా మంది 100 ఏళ్ల‌కు పైగానే ఆయుర్దాయాన్ని క‌లిగి ఉన్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆయుర్దాయం గ‌ల ప్ర‌జ‌లు ఉన్న ప్రాంతాల్లో ఇది టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. అయితే ఇంత‌కీ ఒకినావా ప్ర‌జ‌ల ఆహార ర‌హ‌స్యం ఏమిటి ? వారు ఇన్నేళ్ల పాటు ఆయుర్దాయాన్ని క‌లిగి ఉండ‌డం వెనుక ఉన్న కార‌ణం ఏమిటి ? అంటే.. ప‌సుపు అని చెప్ప‌వ‌చ్చు. అవును.. పసుపు వ‌ల్లే వారు ఇన్నేళ్ల పాటు జీవించ‌గ‌లుగుతున్నార‌ట‌.

Okinawa People live about 100 years know their food secret
Okinawa People

వారు రోజు అర టీస్పూన్ ప‌సుపుకు అంతే మోతాదులో మిరియాల పొడి క‌లిపి తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతార‌ట‌. ఇదే వారి ఆహార ర‌హ‌స్యం. అందుక‌నే ఒకినావా ప్ర‌జ‌లు స‌గ‌టున 100 ఏళ్ల‌కు పైగా జీవిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల్లో వెల్ల‌డించారు.

ప‌సుపులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉండే క‌ర్‌క్యుమిన్ వ్యాధులు రాకుండా చూస్తుంది. చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉంచుతుంది. అందుక‌నే త్వ‌ర‌గా వృద్ధాప్య చాయ‌లు రావు. కాబ‌ట్టే ఒకినావా వాసులు ప‌సుపును త‌మ నిత్య ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇదే వారి ఆహార ర‌హ‌స్యం. క‌నుకనే వారి ఆయుర్దాయం కూడా ఎక్కువ‌గా ఉంది.

Editor

Recent Posts