Instant Rice Idli : ఇడ్లీల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు.. పిండి నాన‌బెట్టాల్సిన ప‌నిలేదు..

Instant Rice Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాంబార్, చ‌ట్నీల‌తో క‌లిపి తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఇంట్లో కూడా త‌ర‌చూ వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డానికి ముందు రోజే పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా పిండిని త‌యారు చేసుకోక‌పోయిన‌ప్ప‌టికి మ‌నం అప్ప‌టిక‌ప్పుడు ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా ఇన్ స్టాంట్ గా చేసిన ఇడ్లీలు కూడా చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ రైస్ ఇడ్లీ త‌యారీ విధానం..

పేప‌ర్ అటుకులు – ఒక క‌ప్పు, పుల్ల‌టి మ‌జ్జిగ – త‌గిన‌న్ని, బియ్యం ర‌వ్వ – ఒక‌టింపావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Instant Rice Idli you can make them very easily
Instant Rice Idli

ఇన్ స్టాంట్ రైస్ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని మ‌జ్జిగ‌ను పోసి 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ అటుకుల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం ర‌వ్వ‌, ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని మ‌జ్జిగ పోసుకుంటూ మామూలూ ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని 30 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. పిండి నానిన త‌రువాత గట్టిగా అయితే మ‌ర‌లా మ‌జ్జిగ‌నే పోసి క‌ల‌పాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ల‌ల్లో త‌గినంత పిండిని వేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద కుక్క‌ర్ ను ఉంచి అందులో నీటిని పోయాలి.

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ల‌ను ఉంచి 8 నిమిషాల పాటు పెద్ద మంట‌పై 4 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలను కుక్క‌ర్ నుండి బ‌య‌ట‌కు తీసి రెండు నిమిషాల త‌రువాత ప్లేట్ నుండి తీసి స‌ర్వ్ చేసుకోవాలి. వీటిని వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే రుచిగా ఉంటాయి. సాంబార్ తో పాటు మ‌న‌కు న‌చ్చిన చ‌ట్నీల‌తో వీటిని తిన‌వ‌చ్చు. ఇడ్లీ పిండిని త‌యారు చేసి దానిని పులియ‌బెట్టేంత స‌మ‌యం లేని వారు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన ఇడ్లీలను కూడా అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts