iPhone : ఐఫోన్ 13 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్‌..!

iPhone : స్మార్ట్ ఫోన్ల‌పై ఆఫ‌ర్ల‌ను అందించ‌డంలో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ప్రియుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అందులో భాగంగా ఐఫోన్ 13 ఫోన్‌పై ఏకంగా రూ.23వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్‌ను ఫ్లిప్‌కార్ట్ స్టాక్ ఉన్నంత వ‌రకే అందించ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది.

iPhone 13 gets massive price cut of Flipkart
iPhone

ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ 13కు చెందిన 128 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.74,900 ఉంది. 256జీబీ, 512 జీబీ మోడ‌ల్స్ ధ‌ర‌లు రూ.84,900, రూ.1,04,900 ఉన్నాయి. అయితే వీటిపై భారీ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. పాత ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.18,500 వ‌రకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోన్‌ను కొంటే 5 శాతం రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో ఐఫోన్ 13కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.56,400కు చేరుకుంటుంది. ఇక 256 జీబీ, 512 జీబీ మోడ‌ల్స్ ధ‌ర‌లు రూ.66,400, రూ.86,400కు చేరుకుంటాయి.

ఇక ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో అద‌న‌పు డిస్కౌంట్‌ను కూడా పొంద‌వ‌చ్చు. దీంతో ఐఫోన్ 13 వేరియెంట్ల‌పై భారీ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో ప్రారంభ మోడ‌ల్‌ను రూ.23వేల త‌గ్గింపుతో కొన‌వ‌చ్చు. అలాగే ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ (2020) మోడల్స్‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

Share
Editor

Recent Posts