Samantha : నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా సమంత సమాధానాలు చెబుతుంటుంది.
సమంత గతంలో ఒకసారి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చెయ్, నన్ను వివాహం చేసుకో.. అని ఓ నెటిజన్ అడగ్గా.. అందుకు స్పందించిన సమంత.. కష్టం, ఒక పనిచెయ్, నాగచైతన్యనే ఆ విషయం అడుగు, ఆయన ఓకే అంటే ఓకే.. అని సమంత రిప్లై ఇచ్చింది. కాగా అప్పట్లో ఆమె చేసిన ఈ కామెంట్ వైరల్‌గా మారింది.
ఇక ప్రస్తుతం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు కనుక ఫ్యాన్స్ మరోమారు ఆమె కామెంట్లను షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక వారికి సంబంధించిన పాత పోస్టులను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగానే పైన తెలిపిన సమంత పాత కామెంట్‌ను కూడా వైరల్ చేస్తున్నారు.
కాగా మూవీల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీలో నటించగా.. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే యశోద, శాకుంతలం అనే మరో రెండు సినిమాల్లోనూ సమంత నటిస్తోంది.