IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం విదితమే. అయితే ఈ సమయంలో ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను చెన్నై కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ధోనీ నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంత సడెన్‌గా ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎందుకు తప్పుకున్నాడోనని.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక చెన్నై కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను నియమించారు. ఈ మేరకు చెన్నై టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ధోనీ ఈ ఒక్క సీజన్ ఆడి వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడని అనుకున్నారు. అయితే చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే ధోనీ కొనసాగనున్నాడు. ఇక ధోనీ ఇంత అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పలేదు. కేవలం కెప్టెన్‌గానే తప్పుకున్నాడు. అందువల్ల టీమ్‌లో బ్యాట్స్‌మన్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ రవీంద్ర జడేజాకు ధోనీ సలహాలు ఇస్తుంటాడని.. దీని వల్ల ముందు ముందు ధోనీ లేకున్నా.. టీమ్ మాత్రం మెరుగ్గా తయారవుతుందని.. జట్టు యాజమాన్యం ఊహించి ఉంటుంది. అందుకనే ధోనీ కెప్టెన్‌గా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని వేరొకరికి కెప్టెన్‌గా అవకాశం ఇస్తే.. ధోనీ ఆధ్వర్యంలో జట్టు మరింత రాటుదేలుతుందని.. ధోనీ అనుభవంతో మంచి టీమ్‌తోపాటు మంచి కెప్టెన్ కూడా తయారవుతాడని.. చెన్నై టీమ్ ఆలోచించి ఉంటుంది. అందుకనే ధోనీ ఇంత సడెన్ గా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రవీంద్ర జడేజా సారథ్యంలో చెన్నై టీమ్ ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.