ఆధ్యాత్మికం

బయటకు వెళ్లే ముందు పిల్లి ఎదురు వస్తే అశుభమా ?

సాధారణంగా హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతోపాటు పలు నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే మనం ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం లేదా శుభకార్యాలకు బయటకు వెళుతున్న సమయంలో బయట వైపు ఎవరూ రాని సమయంలో చూసి వెళ్తారు. అదే విధంగా మనకు ఎంతో అదృష్టంగా భావించే వారిని ఎదురు రమ్మని మన ప్రయాణాన్ని మొదలు పెడతాము. ఈ క్రమంలోనే ఈ విధంగా బయటకు వెళ్లే సమయంలో కొన్నిసార్లు పిల్లి ఎదురు వస్తే మన మనసు మొత్తం చెడు ఆలోచనలతో నిండిపోతుంది. నిజంగానే బయటికి వెళ్లేముందు పిల్లి వస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.

భారతీయులు పిల్లిని ఎంతో అశుభ్రమైన జంతువుగా భావిస్తారు. ఈ క్రమంలోనే పిల్లి ఎదురుగా వస్తే పని జరగదని, పని నిమిత్తం బయటకు వెళ్లిన వారికి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా కీడు జరుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు పనిని విరమించుకోవడం లేదా ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చొని మంచి నీటిని తాగి మళ్లీ బయలుదేరుతుంటారు. మనం పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా నల్ల పిల్లి ఎదురైతే చాలామంది ఆరోజు పనిని వాయిదా వేసుకుంటారు.

is it good or bad if you see cat when you go outside

నిజానికి పిల్లి వస్తే చెడు జరుగుతుంది అనేది కేవలం మన మూఢ నమ్మకం మాత్రమే. మన దేశంలో అపశకునంగా భావించే పిల్లిని ఇతర దేశాలలో శుభపరిణామంగా పరిగణిస్తారు. పిల్లి ఎదురొచ్చినా, ఎదురు రాకపోయినా మన కర్మ ఏవిధంగా ఉంటే అదే విధంగా జరుగుతుందే తప్ప పిల్లి ఎదురు రావడం వల్ల చెడు జరుగుతుందని భావించడం సరికాదని చెప్పవచ్చు.

పూర్వ కాలం నుంచి ఈ విధమైన నమ్మకం ప్రబలంగా నాటుకుపోయింది. కనుక సహజంగానే ఎవరికైనా పిల్లి ఎదురుగా వస్తే.. ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయం కలుగుతుంది. అయితే ఇది నమ్మేవారికి మాత్రమే. నమ్మకం లేని వారు ఇలాంటి వాటిని పాటించాల్సిన పనిలేదు.

Admin

Recent Posts