Actress Hema Husband : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి హేమ అంటే.. అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరినీ మెప్పించింది. గతంలో మా ఎన్నికల్లో హేమ.. శివ బాలాజీ చేయిని కొరికి వార్తల్లో నిలిచింది. తరచూ ఏదో ఒక వివాదంలో ఈమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే హేమ భర్త గురించి చాలా మందికి తెలియదు.
హేమ అనేక సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్నిగా, అత్తగా, కమెడియన్‌గా నటించి అలరించింది. ఇప్పటికీ ఈమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈమె అతి చిన్న వయస్సులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగింది. నటి హేమ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కెరీర్ పరంగా నటి హేమ మంచి సక్సెస్‌నే సాధించింది. అయితే ఆమె నటిగా ఇంత సక్సెస్ సాధించడం వెనుక ఆమె భర్త ప్రమేయం, ప్రోత్సాహం ఉన్నాయని చెప్పవచ్చు. నటి హేమ భర్త ఎవరు అంటే..
హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన కెమెరామెన్‌గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన కూడా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈయన తండ్రి పేరు జాన్ ఎస్డీ లాల్. జాన్ అహ్మద్ నటి హేమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న నటి హేమను ఆమె భర్త నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకనే నటిగా హేమ అంత గుర్తింపు సాధించిందని చెప్పవచ్చు.