వినోదం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పటికీ తీరని ఒక కోరిక ఉందట..? ఆ కోరిక ఏమిటంటే..?

నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ వైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పవచ్చు.

సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడే ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలబడాలని నిర్ణయించుకున్నాడట. ఆయన అనుకున్న విధంగానే అతి తక్కువ కాలంలోనే కెరియర్ పరంగా సక్సెస్ ని సాధించాడు. మరి ఇలాంటి సక్సెస్ ఫుల్ స్టార్ హీరోకి తన నిజ జీవితంలో ఒక కోరిక మాత్రం తీరలేదు అని చాలా మంది సన్నిహితులు చెబుతూ ఉంటారు.

jr ntr has one unfulfilled wish know what it is

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని 2011లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంటకి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తారక్ భార్య రెండవ సారి గర్భవతి అయిన సందర్భంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నాదట తారక్. ఒకవేళ కూతురు పుడితే మాత్రం మంచి పేరు పెట్టాలని అనుకున్నాడట. ఎన్టీఆర్ ఆశపడిన దానికి వ్యతిరేకంగా రెండవ సారి కూడా కొడుకు పుట్టాడు. నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడచుగా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని చాలాసార్లు సన్నిహితుల దగ్గర వెల్లడించారట ఎన్టీఆర్.

Admin

Recent Posts