వినోదం

NTR : ఎన్టీఆర్‌ తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాల న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు వ‌చ్చింది. అయితే నవంబర్ 16తో తారక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి 23 సంత్సరాలు పూర్తయింది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ గురించిన వార్తలే వస్తున్నాయి. తారక్ సినిమాల గురించి.. అతని గురించి తెలియని ఇంపార్టెంట్ విషయాల గురించే పెద్ద ఎ్తతున వార్తలు వైరల్ అవుతున్నాయి.

1997లో బాల రామాయణం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు జూనియర్. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి అవార్డులతోపాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లో రూ.4 లక్షలు తీసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం 17 ఏళ్ల వయసులో ఈయనకు వచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని సీదా ఇంటికి వెళ్లిపోయాడు.

jr ntr remuneration for his first movie do you know it

ఆ రెమ్యున‌రేష‌న్ తీసుకెళ్లి త‌న తల్లికి ఇచ్చాడు ఎన్టీఆర్. తొలి సినిమా తర్వాత రెండేళ్లలోనే స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన ఒక్కో సినిమాకు కనీసం రూ.30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన‌ ‘ఆర్ఆర్ఆర్‌’లో తారక్‌ కొమురం భీమ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Admin

Recent Posts