Kakarakaya Nilva Pachadi : చేదు లేకుండా కాక‌ర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కాక‌ర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా వీటితో వేపుడు, పులుసు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట చేయ‌డం రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా కాక‌ర‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాక‌ర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాక‌ర‌కాయ‌లు – 500 గ్రా., రాళ్ల ఉప్పు – ముప్పావు క‌ప్పు, చింత‌పండు – 50 గ్రా., కారం – ఒక క‌ప్పు, ఆవ పిండి – ఒక క‌ప్పు, ప‌సుపు – ఒక టీ స్పూన్, మెంతులు – 2 టేబుల్ స్పూన్స్, కాచి చ‌ల్లార్చిన ప‌ల్లి నూనె – 300 ఎమ్ ఎల్.

Kakarakaya Nilva Pachadi without any bitterness
Kakarakaya Nilva Pachadi

కాక‌ర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా కాక‌ర‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని గాలికి ఆర‌బెట్టాలి. కాక‌ర‌కాయ‌లు ఆరిన త‌రువాత వాటి చివ‌ర‌ల‌ను తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వీటిని పావు ఇంచు మందంతో ముక్క‌లుగా క‌ట్ చేసి మ‌ర‌లా అర‌గంట పాటు గాలికి ఆర‌బెట్టాలి. త‌రువాత ఒక జార్ లో రాళ్ల ఉప్పు, చింత‌పండు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కారం, ప‌సుపు, మెంతులు, ఆవ‌పిండి వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత కాక‌ర‌కాయ ముక్క‌లు, నూనె పోసి క‌లుపుకోవాలి. మ‌సాలాల‌న్నీ ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకున్న త‌రువాత వీటిని గాజు సీసాలో లేదా జార్ లో వేసి 3 రోజుల పాటు ఊర‌బెట్టాలి. ప‌చ్చ‌డిని రోజుకు ఒక‌సారి అంతా క‌లిసేలా క‌లుపుతూ ఉండాలి. ఇలా 3 రోజుల పాటు ఊర‌బెట్టిన త‌రువాత ప‌చ్చ‌డిని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాకర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts