Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ అల్లుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమాల్లో నటన పరంగా కల్యాణ్ దేవ్ మంచి మార్కులనే కొట్టేశాడు. తాను నటించిన విజేత అనే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నటనలో మాత్రం ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కల్యాణ్ దేవ్, శ్రీజ లకు చెందిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీజ, కల్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ.. ఈ మధ్య కాలంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. శ్రీజ తన పేరు చివరన తన భర్త పేరును తొలగించడం.. మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో కల్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించకపోవడం.. ఆయన సినిమాలకు మెగా ఫ్యామిలీలో ఎవరూ ప్రచారం చేయకపోవడం.. ఇక శ్రీజ, కల్యాణ్ దేవ్ ఎక్కడికి వెళ్లినా ఎవరో ఒకరు మాత్రమే విడి విడిగా కనిపించడం.. వంటివి జరిగాయి. దీంతో సహజంగానే వీరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే అటు మెగా ఫ్యామిలీ కానీ, ఇటు కల్యాణ్ దేవ్ లేదా శ్రీజ కానీ ఈ విడాకుల వార్తలను ఖండించలేదు. ఏమీ స్పందించలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు బలపడ్డాయి. అయితే తాజాగా కల్యాణ్ దేవ్ మళ్లీ ఒంటరిగానే కనిపించాడు. ఈ క్రమంలోనే ఆయన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక అందరిలోనూ వీరి విడాకులపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారని.. అందుకనే జంటగా కనిపించేవారు కూడా ఒంటరిగా కనిపిస్తున్నారని.. వార్తలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.