Anupama Parameswaran : గ్లామర్‌ డోసును పెంచిన అనుపమ పరమేశ్వరన్‌..!

Anupama Parameswaran : తెలుగు తెరపై అనుపమ పరమేశ్వరన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె సినిమాల్లో బాగానే నటిస్తుంది. గ్లామర్‌కు ఒకప్పుడు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈమె పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ఓ సినిమాలో ఈమె ఏకంగా లిప్‌ లాక్‌తో అందరికీ షాకిచ్చింది. ఇక తాజాగా చేసిన ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలతో ఈమె అందరికీ పిచ్చెక్కిస్తోంది.

Anupama Parameswaran  latest black color dress photo viral
Anupama Parameswaran

అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగు, తమిళం, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఈమె ప్రేమమ్‌ అనే మళయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈమె త్రివిక్రమ్‌ తెరకెక్కించిన అ..ఆ.. అనే సినిమాలో నటించి అలరించింది.

ఇక ఈ మధ్యే వచ్చిన రౌడీ బాయ్స్‌ అనే చిత్రంతో ఈ అమ్మడు గ్లామర్‌ డోసు పెంచింది. అందులో లిప్‌ లాక్‌ సీన్లు చేసింది. దీంతో అందరూ ఈమెను విమర్శించారు. ఎంతో పద్ధతిగా ఉండే నువ్వు డబ్బు కోసం ఇలాంటి సీన్లు చేస్తావా.. అని ఈమెను విమర్శించారు. అయితే కథ డిమాండ్‌ చేసింది కాబట్టే అలా నటించాల్సి వచ్చిందని ఈమె సమర్థించుకుంది.

ఇక తాజాగా ఈమె షేర్‌ చేసిన బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్‌ 18 పేజెస్‌, కార్తికేయ 2, హెలెన్‌, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూవీలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

Editor

Recent Posts