వినోదం

Sridevi : శ్రీ‌దేవిని పెళ్లి చేసుకోవాల‌ని అడిగితే.. క‌మ‌ల్ హాస‌న్ వ‌ద్ద‌న్నార‌ట‌.. ఎందుకో తెలుసా..?

Sridevi : యూనివ‌ర్స‌ల్ స్టార్‌గా పేరుగాంచిన క‌మ‌ల హాసన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న‌కు అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్ప‌ట్లో ఈయ‌న అనేక మంది హీరోయిన్ల‌తో క‌లిసి సినిమాలు చేశారు. ఈయ‌న చేసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అప్ప‌ట్లో క‌మ‌ల‌హాస‌న్‌, శ్రీ‌దేవిల జంట అంటే.. ప్రేక్ష‌కుల‌కు బాగా క్రేజ్. వీరి సినిమాలు చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. శ్రీ‌దేవి, క‌మ‌ల‌హాస‌న్ జంట‌గా ఏదైనా చిత్రం వ‌చ్చిందంటే.. ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేవారు. ఇప్ప‌టికీ వీరి మూవీలు టీవీల్లో వ‌స్తుంటే ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ చూస్తారు. అంత‌టి క్రేజ్ ఈ జంట‌కు ఏర్ప‌డింది.

అయితే అప్ప‌ట్లో వీరు అనేక చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా.. స‌క్సెస్‌ఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా అనుకున్నారు. కానీ క‌మ‌ల్ వ‌ద్ద‌న్నార‌ట‌. శ్రీ‌దేవికి జోడీగా క‌మ‌ల్ అయితే బాగుంటార‌ని ఆమె త‌ల్లి ఆశ‌ప‌డింద‌ట‌. దీంతో ఆయ‌నను ఇదే విష‌యం అడిగింద‌ట‌. కానీ క‌మ‌ల్ అందుకు నో చెప్పార‌ట‌. శ్రీ‌దేవిని తాను తోబుట్టువులా చూస్తాన‌ని.. సినిమాల వ‌రకే హీరో హీరోయిన్లు కానీ.. రియ‌ల్ లైఫ్‌లో ఆమె సోద‌రితో స‌మానం అని క‌మ‌ల్ అన్నార‌ట‌. దీంతో ఆయ‌న వ‌ద్ద ఇక పెళ్లి ప్ర‌స్తావ‌న తేలేదు. అందుక‌నే ఆయ‌న శ్రీ‌దేవిని వివాహం చేసుకోవాల‌ని అడిగినా కుద‌ర‌ద‌ని చెప్పేశారు.

kamal haasan said no to sridevi marriage

ఇక ఈ విష‌యాల‌ను క‌మ‌ల్ స్వ‌యంగా వెల్ల‌డించారు. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌రువాత ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న శ్రీ‌దేవితో త‌న‌కున్న అనుబంధాన్ని, విశేషాల‌ను పంచుకున్నారు. కాగా వీరిద్ద‌రూ క‌ల‌సి చేసిన ఆక‌లి రాజ్యం, వ‌సంత కోకిల‌, ఒక రాధ ఇద్ద‌రు కృష్ణులు సినిమాలు అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలు వ‌స్తుంటే ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు క‌ళ్లార్ప‌కుండా చూస్తూనే ఉంటారు.

Admin

Recent Posts