ఆధ్యాత్మికం

Lord Hanuman : శ‌నివారం హ‌నుమంతుడికి పూజ‌లు చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lord Hanuman : శనివారం.. మందవారం.. స్థిరవారం ఇలా పిలిచే ఈరోజు అంటే సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి, విష్ణువు, శ్రీరాముడికి చాలా ప్రతీతి. అంతేకాదు కలియుగంలో శ్రీఘ్రంగా సాక్షాత్కరించే ఆంజనేయస్వామికి కూడా ప్రీతికరం. శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిల‌వబడే శనివారం శ్రేష్టమైనది. స‌తతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః, హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః.. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం.

శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారం రోజు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతుడికి రాస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కలిగి మిత్ర సమృద్ధి పెరిగి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కానీ, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కానీ శనివార వ్రతం చేయాలి.

do pooja to lord hanuman on satur day know what happens

ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతుడికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. 40 రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెర‌వేరుతాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి. అలాగే భయాలు, రోగాలు, ఈతి బాధలు, నవగ్రహదోషాలు, విజయం కోసం శనివార వ్రతం చేయాలి. శుభ ఫలితాలను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts