Khiladi Movie OTT : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Khiladi Movie OTT : మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ ప‌రిచింది. దీంతో ర‌వితేజ త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించార‌ట‌.

Khiladi Movie OTT  know which platform it will be available
Khiladi Movie OTT

ఇక ఖిలాడి మూవీకి గాను డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో వారు త్వ‌ర‌లో ఈ సినిమాను త‌మ ఓటీటీ యాప్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ విష‌యాన్ని హాట్ స్టార్ స్వ‌యంగా వెల్ల‌డించింది. సినిమా విడుద‌ల‌య్యాక సరిగ్గా నెల రోజుల‌కు ఓటీటీలోకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. అలాగే ముర‌ళీ శ‌ర్మ‌, అన‌సూయలు ముఖ్య‌మైన పాత్ర‌లు పోషించారు. జ‌యంతిలాల్ గ‌డ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. అయితే ర‌వితేజ ఈ మ‌ధ్య‌కాలంలో న‌టిస్తున్న సినిమాలు అన్నీ డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. దీంతో ఆయ‌న‌పై ఒత్తిడి పెరుగుతోంది. అందుక‌నే త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీకి త‌న రెమ్యున‌రేష‌న్ ను త‌క్కువ‌గా తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు. అలాగే ఈ సినిమాను థియేట‌ర్ల‌లో క‌న్నా ఓటీటీల్లో విడుద‌ల చేసేందుకే నిర్మాత‌లు మొగ్గు చూపుతున్నార‌ట‌. కానీ ఇందుకు ర‌వితేజ అంగీకారం తెల‌పాల్సి ఉంది.

Editor

Recent Posts