Konaseema Kodi Vepudu : కోన‌సీమ కోడి వేపుడు.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Konaseema Kodi Vepudu : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఈ చికెన్ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కో రుచితో త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే అలాగే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే కోన‌సీమ కోడి వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కోన‌సీమ కోడి వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, ప‌సుపు- పావు టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర కిలో, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్.

Konaseema Kodi Vepudu recipe in telugu very tasty how to cook
Konaseema Kodi Vepudu

కోన‌సీమ కోడి వేపుడు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి రాగానే అల్లం పేస్ట్ వేసిప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి మ‌సాలాల‌న్ని చ‌క్క‌గా వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. చికెన్ కు మ‌సాలాల‌ను ప‌ట్టించి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ ను వేయించాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో చికెన్ ను క‌లుపుతూ వేయించాలి.

ఇలా అర‌గంట పాటు చికెన్ ను వేయించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌, క‌రివేపాకు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోన‌సీమ కోడి వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తిన‌వ‌చ్చు. అలాగే సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా కూడా ఈ కోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ వేపుళ్ల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు.

D

Recent Posts