Yellow To White Teeth : మనలో చాలా మందికి ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకున్నప్పటికి దంతాలు పసుపు రంగులో ఉంటున్నాయి. దీంతో వాళ్లు సరిగ్గా సరిగ్గా మాట్లాడలేక, చక్కగా నవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దంతాలపై గార పేరుకుపోవడంతో పాటు నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలతో కూడా మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. అయినా ఫలితం లేక బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఒక సులభమైన ఇంటి చిట్కాను వాడడం వల్ల దంతాలను రెండు రోజుల్లోనే తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం కూడా చాలా తేలిక. దీనిని తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం మూడు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది.
అలాగే ఈ పదార్థాలు కూడా మన వంటింట్లో ఉండేవే. దంతాలపై ఉండే గారను, పసుపుదనాన్ని తొలగించి దంతాలను తెల్లగా మార్చే ఈ చిట్కా ఏమిటి..దీనిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి. తరువాత ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవచ్చు లేదా ఇందులో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకుని కూడా దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం తొలగిపోతుంది. దంతాలు తెల్లగా మారతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు సమస్యలు తగ్గి చిగుళ్లు ఆరోగ్యంగా మారతాయి. దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఈచిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.