Ghee Benefits : విరిగిన ఎముక‌ల‌ను సైతం అతికిస్తుంది.. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు..

Ghee Benefits : నెయ్యి.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. పాల నుండి దీనిని త‌యారు చేస్తారు. వంట‌ల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే నెయ్యితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. నెయ్యితో చేసిన ప‌దార్థాలు చాలా చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉంటాయి. చాలా మంది అన్నంలో కూడా నెయ్యిని వేసుకుని తింటూ ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అయితే చాలా మంది నెయ్యిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది. లావుగా త‌యారవుతారు అని భావిస్తూ ఉంటారు. అయితే నెయ్యిని తిన‌డం వ‌ల్ల కొవ్వు పేరుకుపోతుంది అని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే నెయ్యిని తగిన మోతాదులో త‌గిన ప‌ద్ద‌తిలో త‌గిన స‌మ‌యంలో తీసుకుంటే మ‌న శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

నెయ్యిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నెయ్యిని ఏ విధంగా తీసుకోవాలి.. ఎలా తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం స్వ‌చ్ఛ‌మైన, శుద్ద‌మైన నెయ్యిని మాత్ర‌మే తీసుకోవాలి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల నుండి శ‌బ్దం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ పౌంద‌ర్యం మెరుగుప‌డుతుంది.

Ghee Benefits how to use it for different type of health problems
Ghee Benefits

జుట్టు రాల‌డం స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో మ‌రియు పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. కంటి చూపు పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. అయితే నిపుణులు వీలైనంత వ‌ర‌కు ఆవు నెయ్యిని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఆవు నెయ్యి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి రోజుకు 2 నుండి 3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. వంట‌ల్లో నూనెకు బ‌దులుగా నెయ్యిని ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే అన్నం, చ‌పాతీ వంటి వాటితో కూడా నెయ్యిని క‌లిపి తీసుకోవ‌చ్చు.

అలాగే నెయ్యిని వీలైనంత వ‌ర‌కు ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం మాత్ర‌మే తీసుకోవాలి. రాత్రి పూట ఎక్కువ‌గా నెయ్యిని తీసుకోకూడ‌దు. అదే విధంగా నెయ్యి ఎంత పాత‌దైతే అంత మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా నెయ్యి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నెయ్యిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts