వినోదం

Sr NTR And Jr NTR : రూపురేఖలే కాదు.. ఆ లక్షణాలు కూడా Sr ఎన్టీఆర్ నుంచి Jr ఎన్టీఆర్ కు వచ్చాయి అనడానికి ఉదాహరణ..

Sr NTR And Jr NTR : తెలుగు చిత్ర‌సీమ‌లో నంద‌మూరి తార‌కరామారావు చెర‌గని ముద్ర వేసుకున్నారు. విల‌క్ష‌ణమైన త‌న న‌ట‌న‌తో ఎన్టీరామారావు న‌ట విశ్వ‌రూప‌రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక నంద‌మూరి ఫ్యామిలీలో ఎన్టీరామారావు త‌ర‌వాత ఆయ‌న న‌ట ప్ర‌స్థానాన్ని బాల‌కృష్ణ కొన‌సాగించారు. బాల‌య్య త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కు వ‌చ్చింది. ఎన్టీఆర్ పోలిక‌లు తాత‌లా ఉండ‌టం.. న‌ట‌న‌లోనూ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవ‌డంతో బాల‌య్య కంటే ఎన్టీఆర్ కు ఎక్కువే క్రేజ్ ఉంది. అన్నగారు ఎన్టీ రామారావు చాలా మొండివారని ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి సినిమాలు చేసిన వారు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు.

ఇక తాతగారి రూపురేఖలతో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ కు తాతగారి ఆ మొండితనం కూడా వచ్చిందని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన పరుచూరి పలుకులు కార్యక్రమంలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ను షూట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి ఒక క్లాసు తగిలి గాయం అయ్యిందట.

Jr NTR got these qualities from sr ntr

దీంతో పరుచూరి గోపాలకృష్ణ గారు వివి వినాయక్ ను షూటింగ్ అపేసారా అని ప్రశ్నించగా.. లేదు సార్ తారక్ షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని చెప్పారు అని అన్నారట. ఆ సమయంలో పరుచూరి కి సీనియర్ ఎన్టీఆర్ మొండితనం గుర్తుకు వచ్చిందట. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్.టి.రామారావు చేతికి కూడా గాయం తగిలి రక్తం కారిందట.. అయినప్పటికీ అన్నగారు ఈ మాత్రం దానికే షూటింగ్ ఆపడం ఏంటి అంటూ షూటింగ్ కంటిన్యూ చేశారట. ఇక సర్దార్ పాపారాయుడు సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఆది కూడా అంతే బ్లాక్ బస్టర్ గా నిలిచిందని పరుచూరి అన్నారు.

Admin

Recent Posts