మొబైల్స్ తయారీదారు లావా నూతనంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. యువ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్ లభిస్తోంది. స్టోరేజ్‌ను 128జీబీ ఇచ్చారు. మెమొరీని 512జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో యూజర్లకు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఇందులో డ్యుయల్ సిమ్‌ను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 2 మెగాపిక్సల్ ఏఐ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ కి ఉంటుంది. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్ సైతం ఉంది. ఎఫ్ఎం రేడియోను వాడుకోవచ్చు.