Left Over Rice Vada : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా వ‌డ‌ల‌ను ఇలా చేయండి..!

Left Over Rice Vada : మ‌నం మిన‌ప‌ప్పుతో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వ‌డ‌లు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. త‌రుచూ ఈ వ‌డ‌ల‌ను మ‌నం త‌యారు చేస్తూనే ఉంటాము. అయితే ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు కూడా మ‌నం రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా మిగిలిన అన్నంతో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వ‌డ‌లు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఎలా తయారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 2 క‌ప్పులు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – డీప్ ఫ్రైకు సరిప‌డా.

Left Over Rice Vada recipe very tasty snacks easy to make
Left Over Rice Vada

రైస్ వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా జార్ లో అన్నం, పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. పిండి మ‌రీ మెత్త‌గా ఉంటే కొద్దిగా బియ్యంపిండి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతుల‌కు త‌డి చేసుకుంటూ పిండిని తీసుకుని మిన‌ప వ‌డ లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. చేత్తో వ‌త్తుకోవ‌డం రాని వారు బ‌ట‌ర్ పేప‌ర్ మీద లేదా పాలిథిన్ క‌వ‌ర్ మీద వ‌డ‌లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి.

ఇలా నూనెకు త‌గిన‌న్ని వ‌డ‌లు వేసుకుని కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు వ‌డ‌లు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts