Bhindi 65 : ఫంక్ష‌న్ల‌లో వ‌డ్డించే భిండీ 65.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Bhindi 65 : బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బెండ‌కాయ 65 కూడా ఒక‌టి. దీనిని ఎక్కువ‌గా ఫంక్ష‌న్ ల‌ల్లో, క‌ర్రీ పాయింట్ ల‌లో త‌యారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, రుచిగా ఉండే బెండ‌కాయ 65 తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ బెండ‌కాయ 65 ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ‌ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, లేత బెండ‌కాయ‌లు – అర‌కిలో, శ‌న‌గ‌పిండి – పావు క‌ప్పు, బియ్యంపిండి – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌ల్లీలు – పావు క‌ప్పు, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – 2 టేబుల్ స్పూన్స్.

Bhindi 65 recipe in telugu make in this method
Bhindi 65

బెండ‌కాయ‌ 65 త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత జార్ లో అల్లం, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌ల‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్, బియ్యంపిండి, శ‌న‌గ‌పిండి, ఉప్పు, కారం, జీల‌క‌ర్ర వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని చ‌ల్లుకుని పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత కరివేపాకు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీలు, క‌రివేపాకు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము వేసి క‌లిపి వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ 65 త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts