హెల్త్ టిప్స్

Black Chickpeas : శ‌న‌గ‌ల‌ను రోజూ ఇలా తింటే మ‌న పెద్ద‌ల‌కు ఉండేలాంటి శ‌క్తి వ‌స్తుంది..!

Black Chickpeas : పూర్వకాలంలో మన పెద్దలు సహజసిద్ధమైన ఆహారం తినేవారు. అందుకనే వారు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లపాటు జీవించగలిగే వారు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్‌, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ తింటున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. దీనివల్ల కొందరు ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటున్నారు. అయితే మన పెద్దలు తిన్నట్టు మనం కూడా సహ‌జ‌సిద్ధ‌మైన ఆహారాలను తింటే దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక అలాంటి ఆహారాల్లో శనగలు కూడా ఒకటి. వీటిలో రెండు రకాలు ఉంటాయి.

ఒకటి నల్ల శ‌నగలు, రెండోది కాబూలీ శ‌నగలు. కాబూలీ శనగలకు మీద పొట్టు ఉండదు కానీ నల శ‌న‌గ‌ల‌కు పొట్టు ఉంటుంది. కనుక పొట్టు ఉన్న నల్ల శనగలను మనం రోజూ తినాల్సి ఉంటుంది. మనం రోజూ వీటిని తింటే అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనగలను ఉదయం ఉడకబెట్టుకొని లేదని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మనకి రోజూ నిద్ర సరిగ్గాపడుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

take black chickpeas daily in this way for stamina

ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది..

రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు నల్ల శ‌నగ‌లను గనక తింటుంటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు. కొలెస్ట్రాల్ లెల‌ల్స్ అధికంగా ఉన్నవారు నల్ల శ‌నగలను తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. నల్ల శ‌నగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట, మలబద్ధకం ఉండవు. షుగర్ ఉన్న వారికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని మరో రోజూ తింటుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

శిరోజాల సంరక్షణకు కూడా శనగలు ఎంతగానో పనిచేస్తాయి శనగలను రోజూ తినడం వల్ల జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. శ‌నగల్లో ఉండే క్యాల్షియం మన ఎముకలు, దంతాలను బలంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. వ‌యసు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ అనే సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. చర్మ సమస్యలు ఉన్నవారు రోజూ శనగలను తింటే ఫలితం ఉంటుంది. ఎలాంటి అలర్జీలు అయినా సరే తగ్గిపోతాయి. ఈ విధంగా నల్ల శ‌నగలు మనకు అనేక రకాలుగా మేలు చేస్తాయి కాబట్టి వాటిని రోజూ తినడం మర్చిపోకండి.

Admin

Recent Posts