ప్రపంచంలో అన్ని జీవుల కంటే పాములు చాలా ప్రమాదకరమైనవి మరియు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అందరూ భావిస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొన్ని రకాల స్టంట్స్ ను చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రమాదకరమైన పాములను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అవి మరింత ప్రమాదకరంగా మారి కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండటమే మేలు అని చెప్పవచ్చు.
అయితే తాజాగా ఒక వ్యక్తి పామును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి పామును కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుండగా తన ముఖం మీద పాము కాటు వేసింది. ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు.
పైగా ఈ వీడియోకు 1.3 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. ఎంతో ఓవర్ కాన్ఫిడెంట్ గా కంట్రోల్ చేయగలను అని భావించి ఆ పాముతో స్టంట్స్ ప్రయత్నించాడు. కాకపోతే తిరిగి పాము కాటు వేసింది. కనుక వీటితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులు చేయకూడదని ఇటువంటివి చేస్తే దాని ఫలితం కూడా అలానే ఉంటుంది అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.