Dogs : మనం ఇంట్లో పెంచుకోదగిన జంతువులల్లో కుక్కలు కూడా ఒకటి. కుక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాగే మనిషి కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువగా ఉంటుందని అనే నానుడిని కూడా మనం వింటూనే ఉంటాం. కుక్కలకు ముందుగానే జరగబోయే వాటిని గ్రహించే శక్తి కూడా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కుక్కశకునం కూడా కుక్కలకు సంబంధించిన మనకు అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. కుక్కశకునంలో ఉన్న అనేక విషయాలల్లో కొన్నింటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మనం బయటకు వెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే కుక్క కనిపించే విధానాన్ని బట్టి మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కకు మనం ఇచ్చిన ఆహారాన్ని తిని ఆ కుక్క తన కాలితో కుడి వైపు గోక్కుంటే మనకు శుభం కలుగుతుంది. అలాగే ఎడమ కాలితో కుడి వైపు అవయవాలను, కుడి కాలితో ఎడమ వైపు అవయవాలను తాకితే అది మనకు శుభం కాదని కుక్క శకునం చెబుతుంది. అదే విధంగా ఊరికి వెళ్లేటప్పుడు కుక్క నోటితో రోటి, మిఠాయి. మాంసం వంటి వాటిని పట్టుకుని కనిపిస్తే మనకు ధనలాభం కలుగుతుంది. అలాగే కుక్క ఎత్తుగా ఉండే ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తలను తాకితే కార్య సిద్ది కలుగుతుందని నమ్ముతారు. అలాగే కుక్క తన కుడి కంటితో ప్రవాస వ్యక్తిని చూస్తే కఠిణమైన పనులు కూడా సులభంగా జరుగుతాయని నమ్ముతారు. అదే విధంగా బయటకు వెళ్లేటప్పుడు కుక్క నోటిలో ఎముక పట్టుకుని ఎదురు వస్తే మృత్యు సమానమైన కష్టం కలుగుతుందని కుక్క శకునం చెబుతుంది. అలాగే ప్రయాణాలకు వెళ్లేటప్పుడు అవిటి కుక్క కనిపించినా కూడా కార్యసిద్ది జరగదని కుక్క శకునం తెలియజేస్తుంది. అలాగే ప్రయాణాలకు వెళ్లేటప్పుడు నీటిలో నుండి వచ్చే కుక్క నీటిని విదిలించినట్టు కనిపిస్తే ప్రయాణాల్లో దొంగల నుండి జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు.
అదే విధంగా కుక్క మన చెప్పులను తీసుకెళ్లిన లేదా ఇతరుల చెప్పులను తెచ్చి మ ఇంట్లో పెట్టిన దొంగల నుండి జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అలాగే కుక్క ఎవరినైనా చూసి గుర్రు.. గుర్రు అనే శబ్దం చేస్తే వారికి ధన హాని కలుగుతుంది. అలాగే కుక్క ఎవరి దగ్గరికైనా వెళ్లి వారిని వాసన చూస్తే వారు త్వరలో ప్రయాణం చేయాల్సి వస్తుందట. అలాగే కుక్క పురుషులను కుడి వైపు గోక్కోవడం వల్ల స్త్రీలను చూసి ఎడమవైపు గోక్కోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఉండే ఆకాశాన్ని, పేడను, మలాన్ని తదేకంగా చూడడం వల్ల ఇంట్లోని వారికి ధన లాభం కలుగుతుందట. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కుక్క మూత్ర విసర్జన చేయడాన్ని చూస్తే అనుకున్న పనులు జరగవట. కుక్క కంటి నుండి నీరు కారితే అది శుభానికి సంకేతం అని శకున శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఇంటి గోడలకు కుక్క కాళ్లతో తదేకంగా తాకుతూ ఉంటే ఆ ఇంట్లో దొంగతనం ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. ఈ విధంగా కుక్క చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అర్థం ఉంటుందని శకున శాస్త్రం తెలియజేస్తుంది.