Mango Lassi : వేస‌వి కాలంలో మామిడి పండ్ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌గా లస్సీ.. త‌యారీ ఇలా..!

Mango Lassi : పెరుగుతో చేసుకోద‌గిన ప‌దార్థాల్లో లస్సీ కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తాగుతారు. వేస‌వికాలంలో దీనిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే ల‌స్సీతో పాటు దీనిని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడి పండ్ల గుజ్జు వేసి చేసే ఈ మ్యాంగో ల‌స్సీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా, చ‌ల్ల చ‌ల్ల‌గా మ్యాంగో ల‌స్సీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – అర లీట‌ర్, మామిడి పండ్ల గుజ్జు – పావుకిలో, పంచ‌దార – 4 టేబుల్ స్పూన్స్ లేదా త‌గినంత‌, చ‌ల్ల‌టి నీరు – అర లీట‌ర్.

Mango Lassi recipe in telugu make in this way
Mango Lassi

మ్యాంగో ల‌స్సీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో పెరుగు, మామిడి పండ్ల గుజ్జు, పంచ‌దార వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత చ‌ల్ల‌టి నీరు పోసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న ల‌స్సీని గ్లాస్ లో పోసుకోవాలి. త‌రువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ తో, ఐస్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో ఎంతో రుచిగా, చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే మ్యాంగో ల‌స్సీ త‌యార‌వుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పిల్ల‌లు ఈ ల‌స్సీని మ‌రింత ఇష్టంగా తాగుతారు.

D

Recent Posts