food

రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ప‌రాటా.. త‌యారు చేద్దామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వెరైటీ వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటితో ఏ వంట‌కం చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే కోడిగుడ్ల‌తో ప‌రాటాలు కూడా చేసుకోవ‌చ్చు తెలుసా.. మ‌సాలా ఎగ్ ప‌రాటా చేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. మ‌రి మ‌సాలా ఎగ్ ప‌రాటాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మసాలా ఎగ్ ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు:

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీస్పూన్, కొత్తిమీర తురుము – 1/2 క‌ప్పు, గోధుమ‌పిండి – 1/4 కిలో, నూనె లేదా నెయ్యి – త‌గినంత.

masala egg paratha how to make this

మ‌సాలా ఎగ్ ప‌రాటా త‌యారు చేసే విధానం:

ముందుగా ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తీసుకుని ఒక గిన్నెలో వాటిని స‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి. అందులోనే మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా క‌లియ‌బెట్టాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, త‌గిన‌న్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఆ త‌రువాత పిండి ముద్ద‌ను చిన్న చిన్న ఉండ‌ల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చిన్న చ‌పాతీల్లా వ‌త్తుకోవాలి. త‌రువాత అందులో కోడిగుడ్ల మిశ్ర‌మాన్ని పెట్టి అంచులు మూయాలి. అనంత‌రం మ‌ళ్లీ వాటిని చ‌పాతీల్లా వ‌త్తుకోవాలి. ఆ త‌రువాత పెనం మీద నెయ్యి లేదా వెన్న లేదా నూనె వేస్తూ వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ప‌రాటా త‌యార‌వుతుంది..!

Admin

Recent Posts