హెల్త్ టిప్స్

అధికంగా బ‌రువున్నారా..? చూయింగ్ గ‌మ్‌ను న‌మిలేయండి….!

మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని అమితంగా తినేస్తారు. ఎందుకంటే చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి మ‌రి..! అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చూయింగ్ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయి. బాగా టెన్ష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడి ఉన్న‌ప్పుడు చూయింగ్ గ‌మ్‌ను తింటే వెంట‌నే ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక మీరు కూడా బాగా ఒత్తిడికి లోన‌వుతుంటే.. వెంట‌నే ఒక చూయింగ్ గ‌మ్‌ను న‌మిలేయండి. ఒత్తిడి త‌గ్గుతుంది.

2. చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు పెరుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌తగా ప‌నిచేస్తార‌ని 2004లో సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే మెద‌డు యాక్టివ్‌గా కూడా మారుతుంద‌ట‌.

chewing gum eating can reduce weight loss

3. చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

4. దంత క్ష‌యం రాకుండా ఉండాలంటే చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌మ‌లాల‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే షుగ‌ర్ ఫ్రీ చూయింగ్ గ‌మ్‌ను న‌మిలితేనే ఈ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

5. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చూయింగ్ గ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆక‌లిగా ఉన్న వారు చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌. అందువ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా శ‌రీరానికి అందే క్యాల‌రీలు కూడా త‌గ్గుతాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts