Masala Egg Paratha : కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ప‌రాటాలు.. రుచి చూస్తే అస‌లు విడిచి పెట్ట‌రు..

Masala Egg Paratha : కోడిగుడ్ల‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. కోడిగుడ్డు కూర‌, వేపుడు.. ఇలా ర‌క‌రకాల కూర‌ల‌ను చేస్తుంటారు. అయితే కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ప‌రాటాల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కాస్త ఓపిక ఉండాలే కానీ మ‌నం కోడిగుడ్ల‌తో వీటిని ఎంతో రుచిగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా ఎగ్ ప‌రాటాల‌ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీస్పూన్, కొత్తిమీర తురుము – అర‌ క‌ప్పు, గోధుమ‌పిండి – పావు కిలో, నూనె లేదా నెయ్యి – త‌గినంత.

Masala Egg Paratha very easy to make
Masala Egg Paratha

మ‌సాలా ఎగ్ ప‌రాటాల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తీసుకుని ఒక గిన్నెలో వాటిని స‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి. అందులోనే మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా క‌లియ‌బెట్టాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, త‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌లిపి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఆ త‌రువాత పిండి ముద్ద‌ను చిన్న చిన్న ఉండ‌ల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చిన్న చ‌పాతీల్లా వ‌త్తుకోవాలి. త‌రువాత అందులో కోడిగుడ్ల మిశ్ర‌మాన్ని పెట్టి అంచులు మూయాలి. అనంత‌రం మ‌ళ్లీ వాటిని చ‌పాతీల్లా వ‌త్తుకోవాలి. ఆ త‌రువాత పెనం మీద నెయ్యి లేదా వెన్న లేదా నూనె వేస్తూ వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ప‌రాటాలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌తో తిన్నా రుచిగానే ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts