Masala Podi For Curries : ఈ మ‌సాలా పొడిని త‌యారు చేసి కూర‌ల్లో వేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Masala Podi For Curries : కూర మ‌సాలా పొడి.. కింద చెప్పిన విధంగా చేసే ఈ మ‌సాలా పొడి చాలా క‌మ్మ‌టి వాస‌న‌తో క‌ల‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఈ మ‌సాలా పొడిని మ‌నం కూర‌లు, వేపుళ్లు, మ‌సాలా కూర‌లు ఇలా దేనిలోనైనా వేసుకోవ‌చ్చు. ఈ మ‌సాలా పొడి వేసి చేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే కూర‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. అలాగే ఈ మ‌సాలా పొడిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఒక్కసారి త‌యారు చేసి పెట్టుకుంటే ఈ మ‌సాలా పొడి 3 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఇంట్లో ఉండే దినుసుల‌తో వంట‌ల‌కు మ‌రింత ప్ర‌త్యేక‌మైన రుచిని తీసుకువ‌చ్చే ఈ కూర మ‌సాలా పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన మ‌సాలా దినుసులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక క‌ప్పు, మిరియాలు – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – ఒక టీ స్పూన్, యాల‌కులు – 10, దాల్చిన చెక్కలు – 2 చిన్న‌వి, జీల‌క‌ర్ర – అర క‌ప్పు, ఆవాలు – పావు క‌ప్పు, త‌డి ఆరిపోయిన క‌రివేపాకు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 3, ఎండుమిర్చి – 10 లేదా 11, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

Masala Podi For Curries make in this method
Masala Podi For Curries

మ‌సాలా పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు వేసి వేయించాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మిరియాలు, ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మెంతులు వేసి వేయించాలి. వీటిని వేయించిన త‌రువాత బిర్యానీ ఆకుల‌ను ముక్క‌లుగా చేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఎండుమిర్చి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత వేయించిన ఎండుమిర్చితో పాటు మిగిలిన దినుసుల‌ను కూడా జార్ లోకి తీసుకోవాలి.ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌సుపు వేసి మెత్త‌గామిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ పొడి చ‌ల్లారిన త‌రువాత మూత ఉండే గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌సాలా పొడి త‌యార‌వుతుంది. ఈ పొడి 3 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 5 నుండి 6 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన పొడిని వంట‌ల‌ల్లో వాడ‌డం వ‌ల్ల వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయి.

D

Recent Posts