Matar Paneer Masala Curry : ప‌చ్చి బ‌ఠానీలు, ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా క‌ర్రీని ఇలా చేసుకోవ‌చ్చు..!

Matar Paneer Masala Curry : మ‌నం ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ప‌న్నీర్ తో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ప‌న్నీర్ తో చేసిన ర‌క‌ర‌కాల వంట‌కాలు ల‌భిస్తూ ఉంటాయి. ఈ ప‌న్నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర‌ను రెస్టారెంట్ ల‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా కూర‌ను రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌న్నీర్ – 200 గ్రా., ప‌చ్చి బ‌ఠాణీ – ఒక క‌ప్పు, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 4, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

Matar Paneer Masala Curry recipe in telugu how to make it
Matar Paneer Masala Curry

మ‌సాలా దినుసులు..

జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, సార పప్పు – ఒక టేబుల్ స్పూన్, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 3.

మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత పావు గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, బ‌ఠాణీ వేసి వేయించాలి. బ‌ఠాణీ వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత ప‌న్నీర్, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌ర్ ప‌న్నీర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ప‌న్నీర్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా బ‌ఠాణీలు వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఈ విధంగా మ‌ట‌ర్ ప‌న్నీర్ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts