Mayonnaise : బ‌య‌ట రెస్టారెంట్లు, బేక‌రీల‌లో ల‌భించే మ‌యోనీస్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Mayonnaise : ఫాస్ట్ ఫుడ్ వంట‌కాల్లో, వివిధ ర‌కాల చిరుతిళ్ల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే ప‌దార్థాల్లో మ‌యోనీస్ ఒక‌టి. చాలా మందికి ఈ మ‌యోనీస్ గురించి తెలిసే ఉంటుంది. స్టార్ట‌స్, బ‌ర్గ‌ర్స్, రోల్స్, స‌లాడ్స్ వంటి వాటి త‌యారీలో ఈ మ‌యోనీస్ ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. దీనిని ఎక్కువ‌గా ఎగ్స్ తో త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఎగ్ లెస్ మ‌యోనీస్ కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భ్య‌మ‌వుతుంది. ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌ల‌ప‌కుండా ఈ ఎగ్ లెస్ మ‌యోనీస్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎగ్ లెస్ మ‌యోనీస్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ లెస్ మ‌యోనీస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చ‌ల్ల‌టి పాలు – అర క‌ప్పు, ఉప్పు – అర టీ స్పూన్, పంచ‌దార – అర టీ స్పూన్, రిఫైండ్ ఆయిల్ – అర క‌ప్పు, డిజాన్ మ‌స్ట‌ర్డ్ – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్.

Mayonnaise recipe in telugu how to make this at home
Mayonnaise

ఎగ్ లెస్ మ‌యోనీస్ తయారీ విధానం..

ముందుగా ఒక జార్ లో చ‌ల్ల‌టి పాలు, ఉప్పు, పంచ‌దార వేసి 20 సెక‌న్ల పాటు బ్లెండ్ చేసుకోవాలి. త‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి హైస్పీడ్ మీద మ‌రో 30 సెక‌న్ల పాటు బ్లెండ్ చేసి ఆఫ్ చేయాలి. త‌రువాత మ‌రో 2 టేబు్ స్పూన్ల నూనె వేసి మ‌రో 30 సెకన్ల పాటు బ్లెండ్ చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇలా 30 సెక‌న్లకొక‌సారి నూనె వేస్తూ బ్లెండ్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా 10 నుండి 12 సార్లు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌యానీస్ చిక్క‌బ‌డుతుంది. త‌రువాత డిజాన్ మ‌స్ట‌ర్డ్, వెనిగ‌ర్ వేసి మ‌రో రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. దీనిని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎగ్ లెస్ మ‌యోనీస్ త‌యార‌వుతుంది. దీనిని స‌లాడ్స్, సాండ్విచ్, పాస్తా వంటి వాటిలో వేసుకుని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా చాలా స‌లుభంగా ఎగ్ లెస్ మ‌యోనీస్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు.

D

Recent Posts