Tella Gurivinda : ఔషధ గుణాలు కలిగిన తీగ జాతి మొక్కల్లో తెల్ల గురివింద మొక్క కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, చేల కంచెలకు, పెద్ద పెద్ద చెట్లకు అల్లుకుని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ తీగ మొక్కకు అతీత శక్తులు ఉంటాయని దీని వేరును తాయత్తులో ఉంచి మెడలో కట్టుకుంటే నరదిష్టి తగలకుండా ఉంటుందని నమ్మేవారు. అలాగే గురివింద గింజలను ఐదింటిని తీసుకుని ఆంజనేయ స్వామి సింధూరంలో ఉంచి మొలతాడుకు కట్టుకుంటే నర దిష్టి, నర ఘోష తగలకుండా ఉంటాయని ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఈ గురివింద గింజలను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పురుషుల్లో వచ్చే లింగ బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఈ తెల్లగురివింద మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ గింజల పొడి 2 గ్రాములు, పొంగించిన వెలిగారం 2 గ్రాములు, దొండాకులు రెండింటిని తీసుకుని వీటిని నిమ్మరసంలో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పురుషులు నిద్రించేటప్పుడు అంగానికి రాసుకోవాలి. ఉదయం పూట నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల లింగ బలహీనత వారం రోజుల్లో తగ్గుతుంది. అదే విధంగా బట్టతల బారిన పడిన వారు సమస్య తలెత్తగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ గురివింద తీగ ఆకులను మెత్తగా నూరి తలపై రుద్దాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ తెల్లగురివింద గింజల పొడి, యాలకుల పొడి, దేవదారు చెక్క పొడి, చంగల్వకోష్టు పొడి వీటిని సమానంగా తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 100 గ్రాముల మోతాదులో తీసుకుని మంచి నీటితో మెత్తగా నూరాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని 100 గ్రాముల గుంటగలగరాకు రసంలో వేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమంలో 400 గ్రాముల నల్ల నువ్వుల నూనె పోసి నూనె మిగిలే వరకు చిన్న మంటపై వేడి చేయాలి. తరువాత ఈ తైలాన్ని వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తైలాన్ని ప్రతిరోజూ తలకు రాసుకుంటూ ఉంటే తెల్ల వెంట్రుకలు క్రమంగా నల్లగా మారుతాయి. అలాగే బహిష్టు సక్రమంగా లేని స్త్రీలు ఈ తెల్ల గురివింద తీగ ఆకులను గుప్పెడు మోతాదులో తీసుకుని శుభ్రంగా కడిగి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. అలాగే ఈ గింజలను నానబెట్టి పై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత ఈ గింజలను రెండింటిని తీసుకుని బెల్లంతో కలిపి తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అదే విధంగా ఈ మొక్క వేరును మేక మూత్రంతో మెత్తగా నూరి అంగానికి లేపనంగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో అంగస్థంభన సమస్య తగ్గుతుంది. ఈ విధంగా తెల్ల గురివింద గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని అయితే వీటిని ఆయుర్వేద వైద్యున్ని పర్యవేక్షణలో ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.