Minapa Janthikalu : మిన‌ప జంతిక‌ల‌ను ఇలా చేశారంటే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..

Minapa Janthikalu : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే పిండి వంట‌ల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. జంతిక‌ల గురించి మ‌నకు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ జంతిక‌ల‌ను మ‌నం వివిధ రుచుల్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మిన‌ప జంతిక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మిన‌ప జంతిక‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌గుళ్లు – అర గ్లాస్, బియ్యం పిండి – రెండు గ్లాసులు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఉప్పు – త‌గినంత‌, వాము – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌.

Minapa Janthikalu recipe in telugu make tasty of them
Minapa Janthikalu

మిన‌ప జంతిక‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మిన‌ప‌గుళ్ల‌ను వేసి దోర‌గా వేయించాలి. ఈ మిన‌ప‌గుళ్లు పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక జ‌ల్లెడలో బియ్యం పిండిని, మిక్సీ ప‌ట్టుకున్న మిన‌ప పిండిని వేసి జ‌ల్లించుకోవాలి. ఇలా జ‌ల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, వాము వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిలో పావు గ్లాస్ నూనెను వేడి చేసి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జంతిక‌ల గొట్టాన్ని తీసుకుని దానికి నూనెను రాయాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని గొట్టంలో ఉంచి నూనెలో జంతిక‌ల్లా వ‌త్తుకోవాలి.

ఇలా నేరుగా నూనెలో జంతిక‌ల‌ను వ‌త్తుకోవ‌డం రాని వారు జ‌ల్లిగంటె మీద లేదా ప్లేట్ లోకి తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఈ జంతిక‌లు కొద్దిగా కాలిన త‌రువాత అటూ ఇటూ తిప్పుకుంటూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిన‌ప జంతిక‌లు త‌యారవుతాయి. ఈ జంతిక‌లు రుచిగా ఉండ‌డంతో పాటు గుల్ల‌గుల్ల‌గా కూడా ఉంటాయి. ఇలా త‌యారు చేసుకున్న జంతిక‌ల‌ను నిల్వ చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు.

D

Recent Posts