Fennel Cumin Ajwain : ఈ మూడు క‌లిపి తాగితే ఎలాంటి పొట్ట అయినా క‌రిగిపోవాల్సిందే..!

Fennel Cumin Ajwain : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి వంటి కారణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు మ‌న‌ల్ని ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా కూడా చేస్తుంది. అధిక బ‌ర‌వు వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం, బీపీ, షుగ‌ర్, హార్ట్ ఎటాక్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల డైటింగ్ ల‌ను చేస్తూ ఉంటారు. ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌లెత్తి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంది.

అలాగే అధిక బ‌రువును త‌గ్గ‌డానికి మందుల‌ను మార్కెట్ లో దొరికే పొడుల‌ను, తైలాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటి వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అధిక బ‌రువును తగ్గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి…. అలాగే దీనిని ఎలా వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు అన్న వివ‌రాల‌ను ఇప్ప‌డు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం వామును, సోంపు గింజ‌ల‌ను, జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక జార్ లో ఒక టీస్పూన్ వామును, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను, ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి.

Fennel Cumin Ajwain drink reduces belly fat in no time
Fennel Cumin Ajwain

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక‌టిన్న‌ర క‌ప్పు నీటిని తీసుకోవాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ నీటిని చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని ఒక గ్లాస్ లోకి వ‌డ‌క‌ట్టుకుని తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున నెల రోజుల పాటు తీసుకోవాలి. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో మెటాబాలిజం పెరిగి అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. అలాగే శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు కూడా తొల‌గిపోతాయి. ర‌క్తం శుద్ధి అవుతుంది. ఈ చిట్కాను పాటించ‌డంతో చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని అల‌వ‌రుచుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతో పాటు అధిక బ‌రువు వ‌ల్ల క‌లిగే వ్యాధుల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాం.

D

Recent Posts