business

Vi విడుదల చేసిన కొత్త ప్లాన్ తో.. ముఖేష్ అంబానికి టెన్షన్..!

రిలయన్స్ జియో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ లో ఉంది. పైగా ఎన్నో మంచి ప్లాన్స్ ని కస్టమర్లకు అందిస్తున్నారు. అయితే ఈ ప్లాన్లు మొదట్లో తక్కువ ధరకు అందించిన కారణంగా అందరూ జియోని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే తాజాగా ప్లాన్స్ ధరలు పెరగడంతో కస్టమర్లు BSNL కు షిఫ్ట్ అవుతున్నారు. దాంతో వోడాఫోన్ ఐడియా ఈ కాంపిటీషన్ కి లోకి వచ్చింది.

దానిలో భాగంగా కొత్త ప్లాన్లను కస్టమర్లకు అందిస్తున్నారు. వాటిలో ఒక ప్లాన్ అయితే 175 ప్రీ పెయిడ్ ప్లాన్. సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇష్టమైన వాళ్ళకి విఐ మూవీస్ మరియు టీవీ సర్వీసెస్ అందించడానికి రూపొందించారు. ఈ ప్లాన్ లో 15 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో కన్వీనియంట్ మరియు దీనీ ధర కూడా తక్కువ ఉండడంతో కస్టమర్లు కూడా దీని పై ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు.

జియో సినిమాకు పోటీగా Vi మూవీస్ మరియు టీవీ యాప్ ను కూడా వోడాఫోన్ ఐడియా వారు ఈ సంవత్సర ప్రారంభంలోనే లాంచ్ చేయడం జరిగింది. దీనిలో కూడా ఎన్నో ఆప్షన్స్ కస్టమర్లకు ఇవ్వడం జరిగింది, 17 ఓటిటి యాప్స్ తో పాటుగా 350 లైవ్ ఛానల్స్ ను కూడా అందిస్తున్నారు. అయితే దీన్ని ప్రీపెయిడ్ తో పాటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరెన్నో మంచి ప్లాన్లను లాంచ్ చేయడం జరిగింది. దాంతో జియో యూజర్స్ కోసం రిలయన్స్ వారు కూడా కొన్ని రకాల ప్లాన్లను లాంచ్ చేస్తున్నారు.

Peddinti Sravya

Recent Posts