Munakkaya Chepala Pulusu : ఆంధ్ర స్టైల్‌లో మున‌క్కాయ చేప‌ల పులుసు.. త‌యారీ ఇలా..!

Munakkaya Chepala Pulusu : మున‌క్కాయ చేప‌ల పులుసు.. మున‌క్కాయ ముక్క‌లు, నెత్తాలు క‌లిపి చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ పులుసును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ పులుసును త‌యారం చేయ‌డం చాలా తేలిక‌. మొద‌టిసారి చేసే వారు కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మున‌క్కాయ చేప‌ల పులుసును ఎలా త‌యారు చ‌చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మాకాయంత‌, నెత్తాలు – 50 గ్రా., త‌రిగిన మున‌క్కాయ‌- 1, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

Munakkaya Chepala Pulusu recipe make it in andhra style
Munakkaya Chepala Pulusu

మున‌క్కాయ చేప‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా నెత్తాల‌కు ఉండే త‌ల‌, తోక వేరు చేసి రాళ్ల ఉప్పు వేసి 2 నుండి 3 సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మెంతులు వేసి వేయించాలి. త‌రువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెమ్మ‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత మున‌క్కాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం వేసి క‌లపాలి.

త‌రువాత శుభ్రం చేసుకున్న నెత్తాలు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మున‌క్కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యి నూనె పైకి తేలే వ‌రకు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ చేప‌ల పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన మున‌క్కాయ చేప‌ల పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts