Mutton Pachadi : మ‌ట‌న్ ప‌చ్చ‌డిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!

Mutton Pachadi : మ‌న‌లో చాలా మంది నాన్ వెజ్ ప‌చ్చ‌ళ్ల‌ను కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం త‌యారు చేసుకోగ‌లిగే రుచిక‌ర‌మైన నాన్ వెజ్ ప‌చ్చ‌ళ్లల్లో మ‌ట‌న్ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మ‌ట‌న్ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంతో తింటే మ‌ట‌న్ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చాలా మంది దీనిని బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మ‌ట‌న్ ప‌చ్చ‌డిని మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌ట‌న్ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు కూడా చేసుకునేలా మ‌ట‌న్ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక‌చిన్న ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, ఎండుమిర్చి – 3 లేదా 4, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నూనె – ఒక క‌ప్పు లేదా 130 ఎమ్ ఎల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, కారం – పావు క‌ప్పు, ఉప్పు – పావు క‌ప్పు, నిమ్మ‌కాయ‌లు – 2.

Mutton Pachadi recipe in telugu make like this for longer storage
Mutton Pachadi

మ‌ట‌న్ ఉడికించడానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ మ‌ట‌న్ – 400 గ్రా., ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్., తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు.

మ‌ట‌న్ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గావేగిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో క‌డిగిన మ‌ట‌న్ ను వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించాలి. దీనిని 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి కుక్క‌ర్ ను మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి వేయించాలి. మ‌ట‌న్ లోని నీరంతా పోయి మ‌ట‌న్ పొడిగా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌ట‌న్ వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. మ‌ట‌న్ పూర్తిగా ఉడికి ముక్క‌లు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకువేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి మ‌రో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ప‌చ్చ‌డి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. ప‌చ్చ‌డి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని ఒక‌రోజంతా అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని బ‌య‌ట ఉంచి నిల్వ చేసుకోవ‌డం వల్ల నెల‌రోజుల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 2 నుండి 3 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే రుచిగా మ‌ట‌న్ ప‌చ్చ‌డిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts