Naresh : ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతి కొందరిని మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన విషయం విదితమే. అధిక లాభాలు అందిస్తానని చెప్పి చాలా మంది వద్ద ఆమె డబ్బులు వసూలు చేసింది. ఆ తరువాత ఆమె తాను చెప్పినట్లుగా డబ్బులు ఇవ్వలేదు. దీంతో కొందరు బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన భార్య గురించి నరేష్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
రమ్య రఘుపతి కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి మేనకోడలు. కాగా ఆమెను నరేష్ 10 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారు ఒక బిడ్డను కన్నారు. అయితే 5 ఏళ్ల కిందటే తన భార్యతో తాను విడిపోయానని నరేష్ తెలిపారు. అప్పట్లోనూ ఆమె ఇలాగే మోసం చేసేదని.. అందుకనే తన ప్రవర్తన నచ్చక అప్పట్లోనే ఆమెకు విడాకులు ఇచ్చానని తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆమెకు, తనకు ఎలాంటి సంబంధం లేదని.. నరేష్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
రమ్య గతంలో కూడా ఇలాంటి సమస్యలనే తెచ్చి పెట్టిందని.. కనుకనే ఆమెకు 5 ఏళ్ల కిందటే విడాకులు ఇచ్చానని నరేష్ తెలిపారు. కాగా ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం విశేషం. ఇక రమ్య రఘుపతి చాలా మంది నుంచి గ్రూప్ ఇన్‌కమ్ స్కీమ్ కింద డబ్బులు వసూలు చేసింది. అధిక మొత్తం లాభాలను అందిస్తానని చెప్పి డబ్బులను వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఆమె కొందరు బాధితులకు చెక్కులను కూడా ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రమ్య రఘుపతి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. నరేష్ క్లారిటీ ఇచ్చారు.