Diabetes : డయాబెటిస్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలిలో వస్తున్న అనేక మార్పుల వల్లే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బాధితులు రోజూ తాము తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్టర్లు సూచించిన మందులను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
1. దాల్చిన చెక్కను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని మసాలా దినుసుగా వాడుతారు. కానీ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని పాలలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
2. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతోపాటు దగ్గు, జలుబు, జ్వరం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
3. రాత్రి పూట నీటిలో 7 – 8 బాదంపప్పులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని పొట్టు తీసి బ్రేక్‌ఫాస్ట్‌లో తినేయాలి. ఇలా తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు అనేక వ్యాధులు నయం అవుతాయి. బాదంపప్పులో ఉండే పోషకాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి.
4. రోజూ భోజనం చేసిన వెంటనే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.