Shruti Haasan : హీరోయిన్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాటింగ్ ద్వారా తమ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. అందులో భాగంగానే ఫ్యాన్స్ అడిగే అనేక ప్రశ్నలకు వారు సమాధానాలు చెబుతుంటారు. ఇక శృతి హాసన్ కూడా తరచూ ఇలా తన ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఈ ముద్దుగుమ్మ తడుముకోకుండా సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజన్ మాత్రం వింతైన ప్రశ్న అడిగాడు.
శృతి హాసన్ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన సందర్భంగా ఓ నెటిజన్ ఆమెను తన ఆస్తి గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆమెకు ఆస్తి ఎంత ఉంటుంది ? చెప్పాలని కోరాడు. అయితే ఇందుకు శృతి నేరుగా సమాధానం ఇవ్వలేదు. తన ఆస్తి గురించి ఇప్పటికీ తాను ఆలోచిస్తున్నానని, అయితే అది చాలా ఎక్కువే ఉండాలని తాను ఆశిస్తున్నానని.. ఆమె సమాధానం చెప్పింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా గురించి చెప్పాల్సిందిగా ఓ నెటిజన్ కోరాడు. అందుకు ఆమె బదులిస్తూ.. తాను ఈ విషయం గురించి గూగుల్‌లో ఎన్నో సార్లు సెర్చ్ చేశానని.. ఇప్పటికీ సెర్చ్ చేస్తుంటానని.. అయితే దీనికి సంబంధించి అనేక ప్రశ్నలను అందులో చూపిస్తుందని.. చెప్పింది. అయితే శృతి హాసన్ ఈ రెండు ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియకే ఇలా నేరుగా బదులు చెప్పలేదని తెలుస్తోంది.
శృతిహాసన్.. ప్రముఖ నటుడు కమలహాసన్ కుమార్తె అని తెలిసిందే. అయితే తండ్రితో ఈమె, సోదరి అక్షర హాసన్ ఎప్పుడో ఒకసారి కలసి కనిపిస్తారు. వీరు ఎవరి పనుల్లో వారే ఉంటారు. అయితే తండ్రి నుంచి ఈమెకు పెద్దగా ఆస్తి రాలేదని, అందుకనే ప్రియుడితో కలిసి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాలి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ప్రభాస్‌తో కలిసి సలార్ మూవీలో నటిస్తోంది. అలాగే బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయనుంది.