Naga Chaitanya : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత సమంతపై ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. దీంతో ఓ దశలో ఆమె ఆ కామెంట్లను భరించలేక కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆమెపై ఉన్నవీ లేనివీ కల్పించి కొన్ని యూట్యూబ్ చానళ్లలో వీడియోలను ప్రసారం చేశారు. అయితే తరువాత కోర్టు కేసుతో వారు ఆ వీడియోలను తొలగించి సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అప్పటి నుంచి అటు సమంతతోపాటు ఇటు నాగచైతన్యపై వస్తున్న పుకార్లు మాత్రం ఆగడం లేదు. వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా నాగచైతన్య ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడంటూ.. కొందరు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
నాగాచైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి ఇటీవలే బంగార్రాజు అనే మూవీలో నటించగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో చైతూ పక్కన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలోనే సినిమాలో చైతూ, కృతిశెట్టిలు కపుల్‌గా అద్భుతంగా నటించారు. అయితే దీన్ని ఆసరగా చేసుకుని కొందరు పుకార్లను పుట్టిస్తున్నారు.
నాగచైతన్య.. కృతిశెట్టిని రహస్యంగా వివాహం చేసుకున్నాడంటూ కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్ నెయిల్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదని, పూర్తిగా అబద్ధమేనని అందరికీ తెలుసు. ఒక వేళ చైతూ నిజంగానే ఆమెను పెళ్లి చేసుకుంటే బయటకు కచ్చితంగా చెబుతారు. కనుక అందులో ఎంత మాత్రం నిజం లేదని, పూర్తిగా అబద్దమేనని స్పష్టమవుతోంది.
కేవలం యూట్యూబ్ లో పాపులర్ అవడం కోసం, ఫాలోవర్లను పెంచుకోవడంతోపాటు వీడియోలకు వ్యూస్‌ను తెప్పించడం కోసమే కొందరు ఇలా చేస్తున్నారని స్పష్టమైంది. గతంలో సమంత కూడా అలాంటి చానల్స్‌పైనే కేసు నమోదు చేసింది. అయితే ఇలాంటి వార్తలను సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇబ్బందులు పడాల్సి వస్తే మాత్రం తప్పక ఇలాంటి వార్తలపై స్పందించాల్సి వస్తుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే చైతన్య ప్రస్తుతం థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. మాస్కోలో ఇటీవలే ఈ మూవీ చివరి షెడ్యూల్ పూర్తయింది. ఇందులో రాశిఖన్నా నటించింది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీలోనూ త్వరలో చైతూ కనిపించనున్నాడు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించబోయే దూత అనే థ్రిల్లర్ సిరీస్‌లోనూ త్వరలో చైతన్య నటిస్తారని తెలుస్తోంది.