information

యూపీఐ ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోండి..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. రోజురోజుకి ట్రాన్సాక్ష‌న్స్ పెరుగుతూ పోతున్నాయి.చాయ్ తాగితే 10 రూపాయలు చెల్లించడం దగ్గర్నుంచి.. బయట ఏదైనా తిన్నా.. షాపింగ్ చేసినా.. వేలల్లో చెల్లింపులు చేయాలన్నా యూపీఐనే ఎక్కువ మంది వాడుతున్నారు. క్యాష్ క్యారీ చేయ‌డ‌మే మానేశారు. యూపీఐ సేవ‌లు రోజు రోజుకి మ‌రింత పెరుగూత పోతుండ‌డంతో యూపీఐ సేవల్లోనూ కొత్త కొత్త సదుపాయాలు తీసుకొస్తోంది ఆర్బీఐ. వీటిల్లో భాగంగానే ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఇంటర్నెట్ లేకున్నా యూపీఏ 123 పే సర్వీసుల్ని తీసుకొచ్చింది. ఇంకా.. చిన్న మొత్తాల్లో పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు యూపీఐ లైట్ తెచ్చింది. మరోవైపు.. ఒకే యూపీఐతో ఎక్కువ మంది వినియోగించుకునేలా.. యూపీఐ సర్కిల్‌ను కూడా ఇటీవల ప్రకటించింది.

యూపీఐ 123పే, యూపీఐ లైట్ మిలియన్ల కొద్దీ వినియోగదారులకు మరింత ప్రయోజనాలను అందించనుంది. దేశంలో ఇప్పటికే డిజిటల్ పేమెంట్ల ద్వారా యూపీఐ భారత ఆర్థిక రంగాన్ని మార్చింది. యూపీఐ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా UPI123Pay లో ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందులో రూ. 10వేలు యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు, ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 500 నుంచి రూ. వెయ్యికి పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.ఆర్బీఐ యూపీఐ 123పే పేమెంట్లపై ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది.

new upi transaction limits must know about them

చిన్న మొత్తాల్లో డిజిటల్ పేమెంట్స్ సులభతరం చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూపీఐ లైట్ ఫీచర్ తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటిల్లో వాడుకోవచ్చు. ఇక్కడ కూడా వాలెట్‌ నగదు లిమిట్‌ను రూ. 2 వేల నుంచి ఇప్పుడు 5 వేలకు పెంచింది. ఇంకా ఇక్కడ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా రూ. 100 నుంచి 500 కు పెంచుతున్నట్లు వెల్లడించింది. యూపీఐ లైట్ పేమెంట్స్‌లో పిన్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సింగిల్ క్లిక్‌తో పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇందుకోసం వ్యాలెట్లో కొంత మొత్తం క్యాష్ లోడ్ చేయాలి. దీని లిమిట్‌నే ఇప్పుడు 5 వేలకు పెంచింది. బ్యాంక్ సేవల్లో అంతరాయం ఉన్నా ఇక్కడ ఇబ్బంది ఉండదు.గ‌తంలో యూపీఐ ద్వారా టాక్స్ పేమెంట్స్ లిమిట్ గరిష్టంగా రూ. లక్ష వరకు ఉండగా.. దీనిని రూ. 5 లక్షలకు పెంచింది ఆర్బీఐ.

Sam

Recent Posts