Oil For Mosquitoes : ఈ నూనెతో దీపం వెలిగిస్తే చాలు.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండ‌దు..

Oil For Mosquitoes : మ‌న ఇంట్లోకి వ‌చ్చే కొన్ని ర‌కాల కీటకాలు మ‌న‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో దోమ‌లు ఒక‌టి. దోమ‌లు మ‌న‌ల్ని ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వీటి కార‌ణంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మ‌లేరియా వంటి ర‌క‌ర‌కాల వైరల్ ఫివ‌ర్స్ వ‌స్తూ ఉంటాయి. ఈ భూమి మీద 3 వేల ర‌కాల‌కు పైగా దోమ‌లు ఉన్నాయి. అన్నీ కాలాల్లో ఈ దోమ‌లు మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం దోమ‌ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

దోమ‌ల‌ బెడ‌ద‌ను త‌గ్గించే వివిధ ర‌కాల ప్రొడ‌క్ట్స్ మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల దోమ‌ల బెడ‌ద త‌గ్గిన‌ప్ప‌టికి అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి ఉంటుంది. వీటిలో ఎన్నో ర‌కాల ర‌సాయ‌నాల‌ను వాడుతూ ఉంటారు. వీటి వల్ల జ‌లుబు, త‌ల‌నొప్పి, తుమ్మ‌లు, దుర‌ద‌, అల‌ర్జీ వంటి వివిధ‌ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తూ ఉంటాయి. పూర్వ‌కాలం నుండి ఎన్నో ర‌కాల చిట్కాల‌ను ఉప‌యోగించి స‌హ‌జ సిద్దంగా దోమ‌లను నివారిస్తున్నారు. అలాంటి చిట్కాల్లో దోమ‌ల‌ను నివారించే ఈ చిన్న‌, సులువైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం క‌ర్పూరం, వేప‌ నూనె, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లను, క‌ర్పూరం బిళ్ల‌ల‌ను వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి.

Oil For Mosquitoes lit this one for good result
Oil For Mosquitoes

త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక ప్ర‌మిద‌లోకి లేదా కొబ్బ‌రి చిన్న‌లోకి, అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంపై నూనెను వేసి వెలిగించాలి. ఇలా వెలిగించ‌డం వ‌ల్ల దీని నుండి వచ్చే ఘూటు వాస‌న కార‌ణంగా దోమ‌లు బ‌య‌ట‌కు పోతాయి. అంతేకాకుండా దీని నుండి వ‌చ్చే పొగ కార‌ణంగా ఇంట్లో క్రిములు, కీట‌కాలు కూడా న‌శిస్తాయి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇంట్లో చ‌క్క‌టి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. అలాగే ఈ చిట్కాను పాటిస్తూనే ఇంటి చుట్టుప‌క్కల శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండ‌కుండా చూసుకోవాలి.

D

Recent Posts