Pallilu Chinthakaya Pachadi : ప‌ల్లీలు, చింత‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలో వేడిగా తింటే అదిరిపోతుంది..!

Pallilu Chinthakaya Pachadi : ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డి… ప‌చ్చి చింత‌కాయ‌లు, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా రుచిగా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పుల్ల పుల్ల‌గా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి చింత‌కాయ‌లు – 250 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 100 గ్రా., ప‌ల్లీలు – 100 గ్రా., ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన కొత్తిమీర – గుప్పెడు.

Pallilu Chinthakaya Pachadi recipe in telugu make in this method
Pallilu Chinthakaya Pachadi

ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా చింతకాయ‌ల‌ను నీటిలో వేసి మెత్త‌గా ఉడికించి ప‌క్కకు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు చింత‌కాయ‌లను జ‌ల్లెడలో వేసి మెత్త‌ని గుజ్జును తీసుకోవాలి. త‌రువాత జార్ లో వేయించిన ప‌ల్లీలు, ప‌చ్చిమిర్చి, ఉప్పు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత ఇందులో కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. చివ‌ర‌గా ప‌సుపు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి కలిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా ప‌చచ్చి చింత‌కాయ‌ల‌తో చేసిన ఈ ప‌చ్చ‌డిని అంద‌రు ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts