Paneer Bhurji : ప‌నీర్ భుర్జీని ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Paneer Bhurji : మ‌నం ప‌నీర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. పనీర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకల‌ను దృడంగా చేయ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ ను అందించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప‌నీర్ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ బుర్జీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌ల్లో ల‌భిస్తుంది. చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటు ఈ బుర్జీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ప‌నీర్ బుర్జీని సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ బుర్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, స‌న్న‌గా త‌రిగిన క్యాప్సికం – చిన్న‌ది ఒక‌టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా తరిగిన పెద్ద ట‌మాట – 1, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌నీర్ – 200 గ్రా., త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Paneer Bhurji recipe very tasty with roti how to make
Paneer Bhurji

ప‌నీర్ బుర్జీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత క్యాప్సికం వేసి క‌లపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ప‌నీర్ ను న‌లిపి వేసుకోవాలి. త‌రువాత దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ బుర్జీ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts