Healthy Foods : మనం తీసుకునే ఆహారాలను బట్టి మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనందరికి తెలిసిందే. మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని ధృడంగా చేస్తుంది. లేదంటే షుగర్, బీపీ, గుండె జబ్బులు, అధిక బరువు ఇలా అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయి. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం చక్కటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా, ధృడంగా ఉంటుంది. చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆయుష్షు కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మనం రోజూ తప్పకుండా ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
చక్కటి ఆరోగ్యం కోసం మనం రోజూ తీసుకునే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు బ్లూబెర్రీలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రోజూ తాజా కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవాలి. వీటిలో మన శరీరారినికి అవసరమయ్యే ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇక చక్కటి ఆరోగ్యం కోసం చేపలను తీసుకోవాలి.
వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం దీర్ఘకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే రోజూ ఆహారంగా గింజలను, విత్తనాలను తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్ తో పాటు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంబలంగా, ధృడంగా తయారవుతుంది. మన శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అదే విధంగా రోజూ ఆపిల్ పండును కూడా తీసుకోవాలి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆపిల్ ను తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా రోజూ మన ఆహారంలో భాగంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.