Arjun Assets : అర్జున్ సర్జా.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. అర్జున్ సర్జా.మా పల్లెలో గోపాలుడు సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే పలు కన్నడ సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు.పుట్టి పెరిగింది అంత కన్నడిగుడిగానే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాదు.వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి.ఇటీవల అర్జున్ సర్జా పేరు వార్తలలో ఎక్కువగా వినిపిస్తుంది.
అందుకు కారణం విశ్వక్ సేన్‌తో ఆయనకు నెలకొన్న వివాదం. విశ్వక్ సేన్ క్రమశిక్షణ లేని నటుడని అర్జున్ ఆరోపించగా.. నేనేమీ సినిమా నుండి తప్పుకోలేదు ఆయనే తీసేశారు, తప్పు చేసి ఉంటే ఆయన కు క్షమాపణలు తెలియజేస్తున్నాను అని విశ్వక్ అన్నారు. తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాలనుకుంటే విశ్వక్ సేన్ వలన ఆగిపోయిందని అర్జున్ ఆరోపణలు గుప్పించారు. అయితే అర్జున్ నటుడిగా వందకు పైగా చిత్రాలు చేశారు. దర్శకుడిగా 11 చిత్రాలు తెరకెక్కించారు. నిర్మాతగా ఆయన పలు చిత్రాలు నిర్మించారు.
90లలో ఆయన సౌత్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలిగిన అర్జున్ బాగానే కూడ పెట్టినాడు. అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడని అంటున్నారు. అర్జున్ కి దాదాపు రూ. 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఇక భార్య, పిల్లలు, తన పేరిట ఉన్న స్థిర చర ఆస్తులు కలిపితే రూ. 400 కోట్లకు పైగా విలువ ఉంటుందని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. అర్జున్… ఆంజనేయ భక్తుడు కాగా, ఆయన 35 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక గుడి నిర్మించారు.