వినోదం

Pawan Kalyan First Wife Nandini : పవన్ కళ్యాణ్ త‌న మొదటి భార్య నందిని నుండి ఎందుకు విడిపోయాడో తెలుసా..?

Pawan Kalyan First Wife Nandini : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆరాధ్య దైవం. సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు అలరించారు. సినీ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా కూడా తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగారు. టాలీవుడ్లో ఎన్నో విజయాలు సాధించిన పవన్ కళ్యాణ్, ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. జనసేనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ని ఇబ్బంది పెట్టటానికి ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ప్రస్తావన తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రధానంగా చెప్పుకోవడానికి ఆయన చేసుకున్న మూడు పెళ్ళిళ్ళను ఎత్తి చూపుతూ సభా సమావేశాలలో విమర్శలు చేస్తున్నారు.

సొసైటీకి రోల్ మోడల్ గా ఉండవలసిన వ్యక్తి ఇన్ని పెళ్లిళ్లు చేసుకొని ప్రజలకు ఏమి సందేశం ఇస్తాడని ఎక్కువగా విమర్శిస్తున్నారు. పెళ్లి అనేది తన పర్సనల్ వ్యవహారం అని భావించే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఈ విషయంపై ఎక్కడ వివరణ ఇవ్వలేదు. ఈ విషయంపై జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ ఓ మీడియా ఛానల్ కి అప్ప‌ట్లో ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయితో కేవలం నెల రోజులు మాత్రమే కలిసి ఉన్నారని, ఆ తర్వాత ఆమె పవన్ ని ఇల్లరికం రమ్మని కోరిందని ఆ ప్రతిపాదన పవన్ కి ఇష్టం లేకపోవడంతో ఆమె నుంచి విడిపోయారని శ్రీధర్ వెల్లడించారు.

Pawan Kalyan First Wife Nandini why he got separated with her

పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చేవారు. తాను ఎవరో ఇంటికి ఇల్లరికం అల్లుడిగా వెళ్ళటం అనే విషయం భరించలేకపోయాడని, తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉన్న ఆయన ఇల్లరికం అల్లుడిగా తనకు తాను ఉహించుకోలేకపోయారని శ్రీధర్ వెల్లడించారు. పదేళ్ల పాటు ఆమెకు దూరంగా ఉన్న పవన్ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండానే విడాకులు తీసుకొని విడిపోయారని అద్దేపల్లి శ్రీధర్ వెల్లడించారు.

Admin