వినోదం

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన రీమేక్ మూవీలలో సూప‌ర్ హిట్ అయిన మూవీలు ఇవే..!

సాధార‌ణంగా ఒక భాష‌లో ఏదైనా మూవీ హిట్ అయితే ఆ మూవీని ఇంకో భాష‌లో రీమేక్ చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అయితే రీమేక్ చేసినా ప్రాంతీయ‌తకు త‌గిన‌ట్లుగా చిత్రాన్ని నిర్మిస్తేనే బాగుంటుంది. లేదంటే రీమేక్ అయినా స‌రే హిట్ ప‌డ‌దు. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కెరీర్‌లో అనేక సినిమాల‌ను రీమేక్ చేశారు. వాటిల్లో ఎన్ని హిట్‌లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప‌వ‌న్ కెరీర్ లో మొత్తం 24 సినిమాలు తీస్తే అందులో 11 రిమేక్ సినిమాలే. వాటిలో 8 సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.

త‌మిళంలో వ‌చ్చిన గోకులతిల్ సీతైకు రీమేక్‌గా గోకులంలో సీత‌ను తీశారు. పవన్ కళ్యాణ్, రాశి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. ఇది హిట్ అయింది. అలాగే త‌మిళంలో వ‌చ్చిన లవ్ టుడే సినిమాకు రీమేక్‌గా సుస్వాగ‌తం మూవీని తెర‌కెక్కించారు. పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. ఇది కూడా హిట్ అయింది. ఇక ఎస్.జె.సూర్య తమిళంలో తీసిన‌ ఖుషి నే తెలుగులో అదే టైటిల్ తో రిమేక్ చేశారు. భూమిక ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీ కూడా హిట్ అయింది.

pawan kalyan movies those were superhit have been remaked

తమిళ్ తిరుపచి చిత్రానికి రీమేక్ గా అన్న‌వ‌రం మూవీ తీశారు. పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ఈ సినిమాను భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేశారు. స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ సినిమాకు రీమేక్‌గా గ‌బ్బ‌ర్‌సింగ్‌ను తెర‌కెక్కించారు. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా శృతి హాస‌న్ న‌టించింది. హరీష్ శంకర్ డైరెక్టర్. హిందీలో వ‌చ్చిన ఓ మై గాడ్ కు రీమేక్‌గా గోపాల గోపాల తీశారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి డాలీ దర్శకుడు. త‌మిళ్ లో వ‌చ్చిన వీరం అనే సినిమాకు రీమేక్‌గా కాట‌మ రాయుడును తీశారు. ఈ చిత్రానికి కూడా డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇక హిందీలో అమితాబ్, తాప్సీలు న‌టించిన పింక్ చిత్రానికి రీమేక్ గా వ‌కీల్ సాబ్‌ను తెర‌కెక్కించారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్లు కాగా.. హిందీ ల‌వ్ ఆజ్ క‌ల్ ను డాలీ తీన్ మార్ గా రిమేక్ చేశారు. ఇది మాత్రం ఫ్లాప్ గా మిగిలింది.

Admin

Recent Posts